డాక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Wed,February 20, 2019 01:14 AM

ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 19 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జిల్లాలో కొనసాగుతున్న జిల్లా ప్రధాన ఆసుపత్రి, సామాజిక ఆరోగ్యకేంవూదాలలో వైద్యులుగా పనిచేసేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపవూతుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్), జిల్లా ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రధానాసుపత్రి ఖమ్మంలో సివిల్ అస్టెంట్ సర్జన్ 02 పోస్టులు, సామాజిక ఆరోగ్యకేంద్రం సత్తుపల్లి 06 పోస్టులు, సామాజిక ఆరోగ్యకేంద్రం పెనుబల్లి 07 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు వీటికి అర్హులని, వేతనం నెలకు రూ. 40,270 ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి బయోడెటతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాఫీతో ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఖమ్మం నందు గల డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో ఈనెల 21 నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

188
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles