ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

Tue,February 19, 2019 01:31 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : పార్లమెంట్, శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవీఎంల మొదటి విడత పరిశీలన, శిక్షణా తరగతుల నిర్వహణకు నియమింపబడిన జిల్లాస్థాయి నోడల్ అధికారులు అదేవిధంగా శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకుగాను ఇప్పటికే చేపట్టిన ఈవీఎంలను మొదటి విడత పరిశీలనకు సంబంధించి ఇంకనూ నివేదిక సమర్పించని జిల్లా ఎన్నికల అధికారులను సత్వరమే సంబంధిత నివేదిక సమర్పించాలన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయి శిక్షణ నోడల్ అధికారి నివేదికను కూడా సమర్పించాలన్నారు.

ప్రతివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంనకు సమర్పించబడు 9అంశాలతో రూడిన నివేధికను అదేవిధంగా ఇప్పటికే నియమించబడిన వివిధ కమిటీల ఉత్తర్వులను కూడా సత్వరమే సమర్పించాలని సూచించారు. శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ అధికారుల వివరాలను కూడా సమర్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి మార్పులు చేర్పులు అవసరమైన ప్రతిపాదనను కూడా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. వరంగల్లు, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిచిన ఖమ్మం జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి పోస్లు ఖాళీగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానం, ఖమ్మం, పాలేరు, సతుపల్లి శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జె.శ్రీనివాసరావు, ఆర్.దశరథ్, బి.శివాజీ, ఇన్‌చార్జి జిల్లా రెవిన్యూ అధికారి మదన్‌గోపాల్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles