దైవ కార్యక్రమాలకు సమయం కేటాయించాలి

Mon,February 18, 2019 01:21 AM

-ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
-వైభవంగా ద్వజస్థంభ ప్రతిష్టాపనమహోత్సవం
-వేలాదిగా తరలివచ్చిన భక్తులు
-ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ బాలసాని, ప్రముఖులు
మయూరిసెంటర్, ఫిబ్రవరి 17 : ఖమ్మం నగరంలో టీఎన్‌జీవోస్ ఫంక్షన్‌హాల్ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా ప్రత్యేక పూజలతో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, కర్మణః పుణ్య్యాహవాచనము, నిత్యహోమములు, గర్తన్యాసం, భీజన్యాసం, ధాతున్యాసం, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు పాల్గొని మాట్లాడారు. దైవ కార్యక్రమాలకు ప్రజలు సమయాన్ని కేటాయించి పుణ్యకార్యా ప్రాప్తిని పొందేందుకు పూజలు నిర్వహించాలని వారన్నారు. టీఎన్‌జీవొస్ జిల్లా అధ్యక్షులు రామయ్య, హౌజింగ్ సోసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుల నేతృత్వంలో జరిగిన శ్రీసీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దైవభక్తిని పెంపొందించే కార్యక్రమాలన్నారు. టీఎన్‌జీవోస్ సంఘం అధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని నిర్వాహకులను అభినందించారు. టీఎన్‌జీవోస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో రెండు రోజుల పాటు జరిగిన విశేష పూజలు, హోమాల అనంతరం దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. మూడోరోజైన ఆదివారం విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం భక్తుల కోలాహలం నడుమ కనుల పండువగా జరిగింది. ఖమ్మం నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా వీడియోస్ కాలనీ బంధువుల రాకతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్ సంఘం నేతలు సుమారు 20వేల మందికి పైగా భక్తులను అన్నదానం చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసానితో పాటు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు పొట్టపింజర రాజారావు (రామయ్య), కార్యదర్శి గంగవరుపు బాలకృష్ణ, కోశాధికారి వల్లోజి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కొమరగిరి దుర్గా ప్రసాద్, సహాయ కార్యదర్శి బసవరాజు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి శ్రీనివాసరావు, శ్రీధర్‌రావు, శ్రీధర్‌సింగ్, రమణయాదవ్, తెలంగాణ ఎన్‌జీవోస్, జిల్లా బ్రాంచ్ బాద్యులు పాల్గొన్నారు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles