సహస్ర కలశాభిషేకోత్సవానికి అంకురార్పణ

Mon,February 18, 2019 01:21 AM

భద్రాచలం, నమస్తేతెలంగాణ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో సహస్ర కలశాభిషేకోత్సవానికి ఆదివారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు.మాఘ మాసోత్సవాలలో భాగంగా సాయంత్రం 4 గం టలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చారు. అనం తరం స్వామి వారికి ఆరాధన, దర్బార్ సేవ జరిపారు. రాత్రి 8 గం టలకు అర్చకులు యాగశాలలో సహస్ర కలశా భిషేకోత్సవానికి అంకురార్పణ చేశారు. స్వామి వారికి, ఆచార్య, బ్రహ్మ, రుత్విక్కులకు, ఆలయ అధి కారులకు వేద పండితులకు దీక్షా కంకణ ధారణ చేశారు. ఆది, సోమ, మంగళ వారాలలో స్వామి వారికి ఏకాంత సేవ నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో తాళ్లూరి రమేష్ బాబు నమస్తే తెలంగాణకు తెలిపారు. సో మవారం పుష్యమీ నక్షత్రం రోజున పట్టాభిషేకం కూడా నిలిపి వేస్తు న్నట్లు ఈవో వెల్లడించారు. అదేవిధంగా సోమ, మంగళ వారాల్లో స్వామి వారి నిత్య కల్యాణాలు కూడా జరగవని తెలిపారు.
ఘనంగా రాములోరి నిత్య కల్యాణం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆదివారం భద్రాద్రి రాముని నిత్య కల్యాణం కనుల పండువగా జరిపారు. వేకువ జామునే అర్చకులు పవిత్ర గోదావరి తీరం నుంచి పుణ్య నదీ జలాలలను తీసుకొచ్చారు. ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ జరిపారు. తదుపరి ఆరాధన, ఆరగింపు నిర్వహించి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించారు. అర్చకులు నిత్యకల్యాణ మూర్తులను అందంగా అలంకరించి పల్లకీపై ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసు కొచ్చారు. అక్కడ స్వామి వారిని వేంచేయింపజేశారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్య హావచనం జరిపారు. భక్తరామదాసు చేయించిన బంగారు ఆభర ణాలను శ్రీసీతారామచంద్రస్వామి వారికి ధరింప జేసి నిత్య కల్యాణ్యాన్ని వైభవంగా చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles