వీరజవాన్ల త్యాగం మరువలేనిది..

Sun,February 17, 2019 02:36 AM

-పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
-సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ మౌనం పాటించిన పోలీసులు
-జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లలో మౌనం పాటించిన పోలీస్ శాఖ
ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 16 : దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీరజవాన్ల త్యాగం మరువలేనిదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాది ఆత్మహుతి దాడిలో అమరులైన 45 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసులు, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల త్యాగాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ స్మరించుకుని, శ్రద్ధాంజలి ఘటించాలని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. తమ ఉనికి కోసం కాశ్మీర్‌లో టెర్రరిస్టులు జరిపిన పిరికి పంద చర్యలో 45 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల సోదరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరులైన ప్రతి జవాను కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈ ఘటనలో అమరులైన సోదర సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఆత్మ శాంతికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాతృదేశ రక్షణలో మనమంతా ఒక్కటేనని చాటాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో విధులలో ఉన్న సిబ్బంది ఎక్కడిక్కడే రెండు నిమిషాలు మౌనం పాటించారు. అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, ఏఆర్ ఏడీసీపీ శ్యామ్ సుందర్, ఏసీపీలు సత్యనారాయణ, రెహ్మాన్, రామానుజం, రావెళ్ళ సాయిబాబా, విజయబాబు, రియాజ్, కుమారస్వామి, కమిషనర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జానకిరామ్, భాస్కర్‌రెడ్డి, రహమతుల్లా ఖాన్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు సింహాచలం శ్రీనివాస్, మదన్ మోహన్, నాగేశ్వరరావు, ఎస్‌బీ సీఐ సంపత్‌కుమార్, తిరుపతిరెడ్డి ఆర్‌ఎస్‌ఐలు నాగేశ్వరరావు, నాగుల్ మీరా, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

275
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles