కాంగ్రెస్‌లో కల్లోలం...

Sun,February 17, 2019 02:33 AM

-ఖమ్మం ఎంపీ సీటు కేటాయించాలని ఫైర్‌బాండ్ రేణుక పట్టు
-సీటు ఇస్తారా..? రాజీనామా చేయమంటారా..?
-అధిష్టానానికి అల్లిమేటం
-ఖమ్మం లోక్‌సభ సీటు లోకల్‌కా? నాన్‌లోకల్‌కా?
-కాంగ్రెస్ శ్రేణుల్లో మీమాంసా..?
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్జీవంగా, నిస్తేజ స్థితిలో ఉండగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారా యి. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నేరుగా ఆపార్టీ అధిష్ఠానంపై చేసిన ఆరోపణలు జిల్లా రాజ కీయాలలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. తనకు తెలి య కుండా డీసీసీ అధ్యక్షున్ని నియమించారని, రా నున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంసీటు తనకే కేటాయించాలని, అలా కాకుండా మరోకరికి సీటు కేటాయిస్తే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని రేణుక మ్మ ఇచ్చిన అల్టిమేటం ఆపార్టీ కార్యకర్తలను విస్మ యానికి గురిచేస్తుంది. గత కొంత కాలంగా స్థబ్దతగా ఉన్న ఫైర్ బ్రాండ్ ఒక్క సారిగా ఫైర్ కావడం వెనుక జరుగుతున్న రాజకీయాలు ఏమిటి? రానున్న పా ర్లమెంట్ ఎన్నికల్లో ఆమె తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? జిల్లాలో ఉన్న రేణుక అను చరుల అంతరంగం ఏమిటి? అనే విషయాలు ఈరోజు ఖమ్మంలో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేణుక నామమాత్రంగానే ప్రచారం చేశారని, ఆపార్టీ అభ్యర్థుల గెలుపులో ఆమె పాత్ర ఏమీ లేదని, అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆమె ఎక్కడా పనిచేయలేదని, కేవలం విజిట్ నాయ కురాలిగానే ఉన్నారు తప్ప క్రియశీలకంగా వ్యవహ రించలేదని, అలాంటి నాయకురాలికి ఎంపీ సీటు కేటాయిస్తే కాంగ్రెస్‌కు తీరని నష్టం జరుగుతుందని ఆమె వ్యతిరేక వర్గీయులు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈవిషయం తెలిసే ఆమె ముందు గానే అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నట్లుగా ఆమె ప్రాబల్యం జిల్లాలో ఏమి లేదని ఆమె వ్యతిరేక వర్గీయులు బహాటంగానే పేర్కొంటున్నారు.

డీసీసీ అధ్యక్షుని నియామకంతో విభేదాలు బట్టబయలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు రాజకీయ చతురత, ఎత్తుగడలతో రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. రా ష్ట్రంలోని 31 జిల్లాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు, కొత్తగూడెం, పిన పాక, భద్రాచలం నియోజక వర్గాలలో గెలుపొందా రు. అయితే ఈ ఆరు స్థానాలలో కూడా అధికార పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్లే కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ సీఎల్‌పీ లీడర్‌గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కాగా భట్టి సీఎల్‌పీ నేతగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తన మార్కును చూపించాడు.

తన ప్రధాన అనుచరుడైన వైరాకు చెందిన పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌ను డీసీసీ అధ్యక్షునిగా నియమించడంలో భట్టి తన పట్టును నిరూపించుకున్నాడు. అదేవిధంగా ఖమ్మం నగర అధ్యక్షునిగా నియమింపబడిన ఎండీ జావీద్ కూడా భట్టి అనుచరుడే. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం నగరానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేణుకాచౌదరి వర్గీయుడైన నాగండ్ల దీపక్ చౌదరిని కూడా నియమించడంలో భట్టినే కీలక పాత్ర పోషిం చినట్లుగా తెలుస్తోంది. డీసీసీ, ఖమ్మం నగర అధ్యక్షు లు తన ప్రధాన అనుచరులకు వచ్చే విధంగా వ్యవహరించి రేణుక చౌదరితో విభేదాలు పెట్టు కోవడం ఇష్టం లేక రేణుక మనిషికి వర్కింగ్ ప్రెసి డెంట్ పదవిని సృష్టించాడని, దానివల్ల ఏమి ఉపయోగం లేదని, ఒకనగరానికి పార్టీ అధ్యక్షుడు ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరొకరిని నియ మించడం ఏమిటని ఫైర్ బ్రాండ్ అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఖమ్మం ఎంపీ సీటు లోకల్‌కా? నాన్ లోకల్‌కా?
ఖమ్మం ఎంపీ సీటుపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది. రాష్ట్రంలో అనేక చోట్ల కాంగ్రెస్ పరాజయం పాలైన ఖమ్మం జిల్లాలో మాత్రం కాస్తోకూస్తో తన బలాన్ని మరొసారి నిలబెట్టుకుంది. ఇప్పుడు ఇదే అంశం ఆపార్టీలో వర్గ విభేదాలకు దోహదం చేస్తుంది. ఇటీవల శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటున్న ఆపార్టీ నాయకులు ఖమ్మం నుంచి పోటీ చేస్తే గెలుపొందుతామనే దీమాతో ఉన్నారు. దీనిలో భాగంగానే జిల్లాకు చెందిన నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు తనకంటే తనకే ఖమ్మం ఎంపీ సీటు కేటాయించాలని దరఖాస్తులు పెట్టుకుంటున్నా రు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత వీ హను మంతరావు, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వెత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మంకు చెందిన మరో ఇద్దరు ప్రముఖ వ్యాపా రవెత్తలు కూడా సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.

ఇక్కడే రేణుకమ్మ అలకకు పునాది పడింది. తాను ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీ విజయం సాధించి కేంద్రమంత్రిగా పనిచేశానని, ఖమ్మం సీటు తనకే ఖరారైందని గురువారం హైద రాబాద్‌లోని తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆమె ప్రకటించారు. తనకు కాకుండా వేరొకరికి సీటు కేటాయిస్తారనే లీకు రావడం వల్లనే అప్పటిక ప్పుడు తన అనుచరులను పిలిపించుకుని ఫైర్‌బ్రాం డ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తనకు కాకుండా మరొకరికి సీటు కేటాయిస్తే పార్టీకి రాజీనా మా చేస్తానని ఆమె తనదైన శైలిలో హెచ్చరించారు. ఈసమావేశానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాయకులు అయితం రామారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్, నాగంద్ల దీపక్ చౌదరి, పైడిపల్లి కిశోర్, మండెపుడి అప్పారావు, మానుకొండ రాధాకిశోర్, పగడాల మంజుల, సూరపునేని రామారావు, రీతు చౌదరి, ప్రతాప్ రుద్ర, చాగంటి లక్ష్మణ్, జువ్వాది ఆనందరావు, కొరికి వెంకటరత్నం, శ్రీనివాస్‌యాదవ్, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌కె అబ్దుల్ జలీల్, దివ్వెల కృష్ణ య్య, సైదులు, వంకాయలపాటి కృష్ణవేణి, నున్నా రవి తదితరులు హాజరయ్యారు.

278
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles