నేర విచారణలో సమర్థవంతంగా వ్యవహరించాలి

Sun,February 17, 2019 02:31 AM

-కేసుల నుంచి నేరస్తులు తప్పించుకోకుండా చూడాలి
-డిఫెన్స్ కౌన్సిల్‌ను ధీటుగా ఎదుర్కోవాలి
-డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉపేందర్
ఖమ్మం లీగల్ : న్యాయస్థానంలో నేర విచారణ సందర్భంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థవంతంగా వ్యవహరించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్(డీడీవోపీ) రేణుకుంట్ల ఉపేందర్ అన్నారు. శనివారం ఖమ్మం కోర్టులో నిర్వహించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశంలో ఏపీపీలకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. కేసుల విచారణలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా క్రిమినల్ కేసులలో ఒక పద్దతి ప్రకారం ట్రయల్ నిర్వహించి, దోషులు తప్పించుకోకుండా వ్యవహరించాలన్నారు. ఈ క్రమంలో డిఫెన్స్ కౌన్సిల్‌ను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు, సీజ్ చేసిన వస్తువులు, సాక్ష్యాలను ఒక పద్దతి ప్రకారం ప్రవేశపెట్టాలని సూచించారు. ఇందుకోసం సదరు కేసుకు సబంధించి ముందే సన్నద్ధం కావాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించి, మరికొంత సమాచారాన్ని సేకరించాలన్నారు. సమాజంలో నేరాలకు పాల్పడేవారికి తప్పనిసరిగా కోర్టుల్లో శిక్షలు పడేలా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఏపీపీలు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. సమావేశంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొండపల్లి జగన్మోహన్‌రావు, నందిగం సుధాకర్‌రావు, తోకల శ్రీనివాసరావు, పురుషోత్తమరావు, రాజారావు, పుష్పలత, అనిల్, దుర్గ, నాగలక్ష్మి, రిచిత, పీవీడీ లక్ష్మి, ఫణికుమార్ పాల్గొన్నారు. లైజన్ ఆఫీసర్లు భాస్కర్‌రావు, మల్లయ్య, మోహన్‌రావు, శ్రీనివాసరావు, హోంగార్డులు సీతయ్య, యూసుఫ్, పాషా, శ్రీనివాసరావు, అయూబ్, రమణ, చిట్టిబాబు సహకరించారు.

239
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles