జంతు సంరక్షణకు పటిష్ట చర్యలు..

Tue,January 22, 2019 01:30 AM

-జంతు సంక్షేమంపై విస్తృతంగా అవగాహన : కలెక్టర్ ఆర్ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ : జంతు సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జరిగిన జంతు హింస నివారణ సంఘం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 31 వరకు నిర్వహించబడుతున్న జాతీయ జంతు సంక్షేమ పక్షోత్సవాల సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు జంతు సంక్షేమంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారి కలెక్టర్ ఆదేశించారు. వీధి కుక్కల సంతతిని స్టెరీలైజేషన్ ద్వారా అరికట్టాలని, కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జంతుసంరక్షణలో భాగంగా జిల్లాలో పశుసంతలు నిర్వహించే ప్రదేశాలలో సంచార పశువైద్యశాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా జంతువుల రవాణా సమయంలో చిన్నచిన్న వాహనాలలో ఎక్కువ సంఖ్యలో జంతువులును రవాణా నివారించేందుకు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జంతువుల రవాణాకు సంబంధించి మార్కెట్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వీధికుక్కల సంతతి నివారణ, కోతుల బెడద నివారణకుగాను నగరపాలక సంస్థ, పశుసంవర్థకశాఖ అధికారులు సమన్వయంతో తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నర్సింహులు, నగరపాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారి సంతోష్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మీకుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మదన్ జిల్లా సహాకార అధికారి జుంకీలాల్, ఆర్టీఓ శంకర్ జంతుసంక్షేమ బోర్డు సభ్యులు సతీష్ మెంబర్ కం సెక్రటరీ రమేష్ గోశాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

457
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles