పాలేరులో ప్రశాంతంగా పోలింగ్

Tue,January 22, 2019 01:30 AM

-ఖమ్మంరూరల్ మండలంలో 96.67శాతం నమోదు
-పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, జనవరి 21 : పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంరూరల్ మండలంలోని మొత్తం 26 పంచాయతీలకు గాను తెల్దారుపల్లి ఏకగ్రీవం కాగా మిగిలిన 25పంచాయతీల్లో ఎన్నికల అధికారులు ఎన్నికలు జరిపారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం తీవ్ర మంచులోనూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ వార్డుల వారిగా ఓటు వినియోగించకునే వీలుగా ఏర్పాటు చేసినందున పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. రూరల్ మండలంలో మొత్తం 96.67శాతం పోలింగ్ నమోదైంది. వృద్ధులు, బాలింతలు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మద్దులపల్లి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్ కర్ణన్ పరిశీలించారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పోలీసులు గుర్తించిన సమస్యాత్మక గ్రామాలైన గూడూరుపాడు, చింతపల్లిలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. గూడూరుపాడు పోలింగ్ కేంద్రాన్ని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ముందస్తుగానే పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమోరాలు, బందోబస్తు నిర్వహించడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

325
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles