నామినేషన్ కేంద్రాల వద్ద బారులు..

Sat,January 19, 2019 12:27 AM

బోనకల్లు: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద బారులు తీరారు. శుక్రవారం మండలంలోని రావినూతల, ముష్టికుంట్ల, కలకోట, జానకీపురం, బ్రహ్మణపల్లి, బోనకల్లు, గోవిందాపురం-ఎల్ గ్రామాల్లో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద మూడోరోజున పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నామినేషన్లను దాఖలు చేసేందుకు చేరుకున్నారు. ఈ కేంద్రాల వద్ద అన్ని పార్టీల నుంచి జనసమీకరణ చేయడంతో ఆ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు 22 గ్రామాల నుంచి 7 కేంద్రాలకు పోటీచేసే అభ్యర్థులు వచ్చారు. దీంతో సమయం ముగియడంతో ఆ కేంద్రం వద్ద ఉన్న అభ్యర్థులకు స్లిప్ పంపిణీ చేసి నామినేషన్లను క్రమపద్ధతిలో రిటర్నింగ్ అధికారులు తీసుకున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు పోటీచేసే అభ్యర్థులు వారి నామినేషన్లను పట్టుకొని నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది.

366
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles