టీఆర్ గ్రామస్వరాజ్యం..

Sat,January 19, 2019 12:26 AM

-కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కరువు..
-పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుందాం..
-మహబూబాబాద్ ఎంపీ
-అజ్మీరా సీతారాంనాయక్
-ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సమక్షంలో 80 కుటుంబాల చేరిక
కామేపల్లి: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కరువైందని, తెలంగాణ ప్రభుత్వమే ప్రజలకు శ్రీరామరక్ష అని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నెమలిపురి, గోవింద్రాల, రామక్రిష్ణాపురం, కామేపల్లి, ఊట్కూర్, జోగ్గూడెం గ్రామాల్లో విస్తృత పర్యటన చేశారు. మండలంలోని నెమలిపురి గ్రామంలో 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో టీఆర్ పార్టీలో చేరాయి. వీరికి టీఆర్ పార్టీ కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు, నాయకులు ప్రజలను ఓటు బ్యాంక్ కోసమే వాడుకున్నారని, తండా, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. మండలంలోని కాంగ్రెస్ దొరలు నెమలిపురి గ్రామంలో అభివృద్ధికి అడ్డుపడటంతో పాటు గిరిజనులను బానిసలుగా మార్చి వారిపై పైతనం చేస్తున్నారని విమర్శించారు. నెమలిపురి గ్రామంలోని యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి టీఆర్ పార్టీలోకి చేరటం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలందరికీ అందేలా యువత కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోనేలా ప్రతీ టీఆర్ కార్యకర్త కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడుభూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాపాసు పుస్తకాలు అందించడంతో పాటు రైతుబంధు పథకం వర్తించేలా కృషి చేస్తున్నారన్నారు.

జీపీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రతీ టీఆర్ కార్యకర్తకు అండగా ఉంటామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు యువత ముందుకు రావాలన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. యువనేత, టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్ధేశంతో మండలంలోని 7 గ్రామ పంచాయతీల ప్రజలు సర్పంచ్ పాటు పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎంపీపీ మాలోత్ సరి రాంనాయక్, జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీటీసీ తీర్థాల చిదంబరం, సర్పంచ్ జాటోత్ జాయ్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాయల ఉపేందర్, బోడేపూడి వీరప్రతాప్, వడియాల క్రిష్ణారెడ్డి, గుగులోత్ సుందర్, సునీత,అజ్మీర రాజునాయక్, ముత్తబోయిన రామ్మూర్తి, ఏపూరి పాపారావు, కొనకంచి శంకర్, సుధాకర్, భట్టు శంకర్ జర్పుల రామోజీనాయక్, బాణోత్ నెహ్రూనాయక్, గట్టికొప్పుల వీరారెడ్డి, కాలసాని వెంకటభిక్షం, కాట్రాల మల్లయ్య, ఫత్తేమహ్మద్, విష్ణువర్థన్ తదితరులున్నారు.

347
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles