కేటీపీఎస్‌ను సందర్శించిన సింగరేణి డైరెక్టర్లు

Thu,January 17, 2019 01:42 AM

పాల్వంచ: కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారాన్ని సింగరేణి, రైల్వే అధికారులు బుధవారం సందర్శించారు. కేటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి కంపెనీ నుంచి సరఫరా జరుగుతున్న సంగతి తెల్సిందే. సింగరేణి నుంచి కేటీపీఎస్‌కు చేస్తున్న బొగ్గు సరఫరాపై చర్చించేందుకు గాను కేటీపీఎస్‌ను సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్) జె.ఆల్వీన్, సింగరేణి జీఎం (కోల్ మార్కెటింగ్) ఆంతోని రాజా రావు, రైల్వే ఏరియా మేనేజర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మణికుమార్, ప్రసాద్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా 5,6దశల సీఈ టీఎస్‌ఎన్ మూర్తి, కోల్‌ప్లాంట్ ఎస్‌ఈ క్రిష్ణయ్య, డీఈ వరకోటి శ్రీనివాసరావు, కష్ణలతో సింగరేణి, రైల్వే అధికారులు బొగ్గు సరఫరా గురించి చర్చించారు. సింగరేణి నుంచి రోజువారీ ఉత్పత్తి వస్తున్న బొగ్గుకు సంబంధించిన, అలాగే దాని నాణ్యత గురించి కేటీపీఎస్ అధికారులు సింగరేణి అధికారులకు వివరించారు. భవిషత్తులో 5,6 దశలకు ఏ మేరకు బొగ్గు సరఫరా చేయాలనే దానిపై సింగరేణి అధికారులు కేటీపీఎస్ అధికారుల నుంచి సమగ్రంగా వివరాలను సేకరించారు. అలాగే రైల్వే వ్యాగన్ల ద్వారా కేటీపీఎస్‌కు వస్తున్న బొగ్గు సక్రమంగా ఆన్‌లోడ్ జరుగుతున్న అనే దానిపై రైల్వే అధికారులు కూడా కేటీపీఎస్ అధికారుల నుంచి సమాచారం సేకరించారు. భవిషత్తులో రైల్వే పరంగా ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన టెక్నికల్ సమాచారాన్ని కూడా కేటీపీఎస్ అధికారుల వారు తీసుకున్నారు.

223
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles