టీఆర్‌ఎస్ పేదల ప్రభుత్వం

Fri,January 11, 2019 12:56 AM

- ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- 57మందికి సీఎం రీలీఫ్ చెక్కుల పంపిణీ
- ఎంపీ సమక్షంలో టీఆర్‌ఎలో భారీగా చేరికలు

మయూరిసెంటర్: పేదల సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నది కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఆపదలో ఉన్నవారిని ఆపద్బాంధవునిలా ఆదుకుంటున్న కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజలు ధృఢమైన నమ్మకంతో ఉన్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మధిర నియోజకవర్గాలకు చెందిన 57మంది లబ్ధిదారులకు సుమారు రూ. 15.90లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి గురువారం ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వేలాది మంది పేద, మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా అన్నివర్గాల ప్రజలకు సీఎం సహాయ నిధి వరసంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గూడుకట్టుకున్నారన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి నుంచి విడుదలైన నిధులను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. అనంతరం మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ లింగాల కమల్‌రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, సూతకాని జైపాల్, రాయల పుల్లయ్య, పోట్ల శ్రీను, విష్ణువర్ధన్‌రెడ్డి, ముక్తి వెంకటేశ్వర్లు, కోసూరి శ్రీను, కోనకంచి మోషా, యనగంటి కృష్ణ, గోసు మధు, చింతనిపు నర్సింహారావు, ఉమ్మినేని క్రిష్ణ, కన్నెబోయిన సీతారామయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

318
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles