నామినేషన్ల జోరు..


Thu,November 15, 2018 12:12 AM

-మూడోరోజు జిల్లా వ్యాప్తంగా ఐదు దాఖలు
-మధిరలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కమల్ రాజు..
-సత్తుపల్లి, పాలేరు, వైరాలో బీజేపీ అభ్యర్థులు, వైరాలో ఇండిపెండెంట్ అభ్యర్థి నిమినేషన్,
ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి రాములునాయక్‌కు అందజేశారు. అంతకుముందు కోరం టేకులపల్లి మండలం సంపత్ నగర్‌లోని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మడత వెంకట్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ , నాయకులు కనగాల పేరయ్య, పులిగళ్ల మాధవరావులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: నియోజకవర్గ అసెంబ్లీ ఎ న్నికల్లో నామినేషన్ దాఖలు వేగం పుం జుకున్నాయి. బుధవారం మూడు రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ మండలాల నుంచి భారీగా తరలివచ్చిన టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రింగ్ రోడ్డు సెంటర్‌కు చేరుకున్న తాటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. నేరుగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి డాక్టర్ భూక్యా ప్రసాద్, ఆయన సతీమణి డాక్టర్ ఉదయజ్యోతి, బీఎల్‌ఎఫ్ నుంచి తానం రవీందర్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మధిర, నమస్తేతెలంగాణ: మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు బుధవారం మధిర తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌కు సంబంధించిన రెండుసెట్లు మధిర నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్‌జయంతికు అందజేశారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...