పోలింగ్‌స్టేషన్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి

Wed,November 14, 2018 01:14 AM

-సీపీతో వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
-జిల్లాలో 342 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు
-పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం క్రైం, నవంబర్ 13 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలలోని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో ఎన్నికల నిర్వహణలో పోలీస్‌శాఖ తీసుకున్న ముందస్తు చర్యలు, జిల్లాలో అందుబాటులో పోలీస్ ఫోర్స్, ఇంక పోలీస్ బలగాలు అవసరమవుతుందనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో 342 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, జిల్లా పోలీస్ ఫోర్స్‌తో పాటు సెంట్రల్ ఫోర్స్ అందుబాటులో ఉందని తెలిపారు. ఎన్నికలలో పోలీసులు తీసుకున్న బందోబస్తు చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ల బయట వైపు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం, ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వేయడానికి అధికారులందరూ చాలా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీసీపీ మురళీధర్, అడిషనల్ డీసీపీ ఏఆర్ శ్యామ్ సుందర్, నగర ఏసీపీ వెంకట్రావు, ఖమ్మం రూరల్ రామోజీ రమేష్, డీసీఆర్‌బీ రామానుజం, సీఐలు తిరుపతిరెడ్డి, సంపత్‌కుమార్ సెక్షన్ సూపరిడెంట్ హనిఫ్ పాల్గొన్నారు.

218
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles