నేడు పిడమర్తి, కోరం నామినేషన్..

Wed,November 14, 2018 01:14 AM

-హాజరుకానున్న మంత్రులు తుమ్మల, కేటీఆర్,
-ఎంపీ పొంగులేటి, జలగం...
-సత్తుపల్లిలో 20వేల మందితో భారీ ర్యాలీ...
-ఏర్పాట్లను పరిశీలించిన మువ్వా విజయ్‌బాబు
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, నవంబర్ 13 : సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి బుధవారం నామినేషన్ వేస్తున్నారని, ఈ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి జలగం ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావులు హాజరవుతారని డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 10గంటలకు జరిగే నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు తుమ్మల, కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాకర్లపల్లి రోడ్‌లోని హెలీఫ్యాడ్‌లో దిగి అక్కడి నుండి భారీర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. నామినేషన్ అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కనగల స్థలంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాకర్లపల్లి రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు 20వేల మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులతో భారీ ర్యాలీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5మండలాల నుంచి పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కనగల జవహర్‌నగర్‌కు వెళ్లే సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, చల్లగుళ్ళ కృష్ణయ్య, కొత్తూరు ప్రభాకరరావు, కూసంపూడి నరసింహారావు, ఆత్మా కమిటీ ఛైర్మన్ కట్టా అజయ్‌బాబు, పాలెపు రామారావు, తుమ్మూరి శ్రీను, అమరవరపు కృష్ణారావు, గ్రాండ్ మౌలాలీ, దొడ్డాకుల గోపాలరావు, సదర్ రఫీ, అబ్ధుల్ఫ్రీ, కమల్‌పాషా, మోరంపూడి ప్రభాకర్, మట్టా ప్రసాద్, కూకలకుంట నాని, టోపీ శ్రీను, కొప్పుల నరేందర్‌రెడ్డి, గఫార్, తడికమళ్ళ దేవా తదితరులున్నారు.

నేడు ఉదయం 11:06 గంటలకు కోరం నామినేషన్...
ఇల్లెందు నమస్తే తెలంగాణ : ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:06 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఎలాంటి హంగుఆర్భాటం లేకుండానే నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కోరం కనకయ్య మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళలో ఇల్లెందు నియోజకవర్గ రూపురేఖలు మార్చానని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనకు ఆశీర్వాదమన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని , కేసీఆర్‌ను మరిచిపోలేదని ఆయన తెలిపారు. పెద్దలతో చర్చించి 19న ఇల్లెందులో భారీ ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అందుకే నామినేషన్ సందర్భంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా వేస్తున్నట్లు ప్రకటించారు. రెండోవిడత ప్రచారం ముమ్మరం చేశానని తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడికక్కడా నాయకులు, కార్యకర్తలు తన గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారని వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles