అజయ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలి

Wed,November 14, 2018 01:13 AM

-ప్రచారం ముమ్మరంగా నిర్వహించండి..
-అన్నివర్గాలను కలుపుకొని వెళ్లాలి..
-టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం..
-ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే : పువ్వాడ
ఖమ్మం, నమస్తే తెలంగాణ : వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం నగరంలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన, అభ్యర్థి పువ్వాడ కలిసి ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఓటును ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేయాలని సూచించారు. కార్పొరేటర్ నుంచి బూత్ కమిటీల ప్రతినిధులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఓటర్లను తరుచుగా కలుస్తూ ఉండాలన్నారు. ఆక్రమంలో ఖమ్మం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అందించిన సహకారాన్ని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎవరైతే లబ్ధిపొందారో వారిని కలుసుకుని మద్దతు కోరాలన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మాన్ని సుందరీకరించిన తీరును అందరికీ అర్థమయ్యేలా చెపుతూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత నాలుగేండ్ల క్రితం ఖమ్మానికి, ఇప్పుడున్న నగరానికి వ్యత్యాసం ఏమిటో తెలియజేయగలిగితే ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పడే అవకాశం ఉండదని మంత్రి తుమ్మల వ్యాక్యానించారు.

డివిజన్లలో పార్టీపై అభిమానం ఉండికూడా ఏదైనా కారణంచేత బయటికి రాని సానుభూతిపరులను, క్రియాశీల నాయకులను గుర్తించి పకడ్భందీ ప్రచారం చేయాలని కార్పొరేటర్లను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు నగరానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజల స్థితిగతులను చూసి చలించిపోయారని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఖమ్మం అభివృద్ధికి కోరినన్ని నిధులు మంజూరు చేశారని తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు ప్రజాకోర్టులో బుద్ది చెప్పాలనే ఏకైక లక్ష్యంతోనే ముందస్తుకు వెళుతున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పది సీట్లను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పువ్వాడ అజయ్ గెలుపు ఎన్నడో ఖాయమైందన్న మంత్రి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్పొరేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ అని, ప్రతిఒక్కరికీ మంచి భవిష్యత్ ఉంటుందన్న నిజాన్ని మదిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ పార్టీకోసం పనిచేయాలన్నారు.

ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తిచేశామన్నారు. ఆక్రమంలో అన్నివర్గాల ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు తన గెలుపును నిర్ధారించాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని, కార్పొరేటర్లు భాద్యత తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ ఎండీ ఖమర్, కేఎంసీ మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్, డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, టీఆర్‌ఎస్ నగర అద్యక్షుడు కమర్తపు మురళి, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, సీనియర్ నాయకులు కురాకుల నాగభూషణం, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అన్ని డివిజన్ల టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

235
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles