బానోత్ మదన్‌లాల్‌కుఊరూరా ఘనస్వాగతం

Wed,November 14, 2018 01:13 AM

కొణిజర్ల, నవంబర్ 13 : వైరా నియోజకవర్గ శాసనసభ్యునిగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మరింతగా కృషిచేస్తూ ప్రతివ్యక్తికి తలలో నాలుకగా ఉంటానని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ ఉద్ఘాటించారు. మంగళవారం మండల పరిధిలోని అమ్మపాలెం, తనికెళ్ల, తుమ్మలపల్లి, అన్నవరం, రామనర్సయ్యనగర్, మల్లుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ఓటర్లు మదన్‌లాల్‌కు ఘనస్వాగతం పలికారు. మదన్‌లాల్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో మరోసారి ఆదరించి అండగా నిలబడి కారుగుర్తుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని సేవకుడిలా పనిచేస్తూ జిల్లాలోనే వైరా నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచుతానన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలు దేశంలోనే వివిధ రాష్ర్టాలకు ఆదర్శంగా మారాయయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు వై.చిరంజీవి, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డపనేని రామారావు, డేరంగుల బ్రహ్మం, ఏఎంసీ చైర్మన్ బాణోతు నరసింహారావు, చల్లా మోహన్‌రావు, చల్లగుండ్ల నరసింహారావు(బుజ్జి), చెరుకుమల్లి రవి, భుక్యా మీటు, చోడే శ్రీలత, చోడే రమేష్, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీనివాసరావు, మల్లేష్‌యాదవ్, శేషగిరిరావు, జీడయ్య, నాగేశ్వరరావు, పాషా, బాలాజీ, కాంతమ్మ, చందర్‌రావు, కోటి, కృష్ణ, మౌలు పాల్గొన్నారు.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles