కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి


Mon,November 12, 2018 11:53 PM

మధిర, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తెలిపారు. మధిరలోని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఈ నెల 14న మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్యులు పాల్గొంటారని వివరించారు. నామినేషన్ దాఖలు అనంతరం మధిర పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను ఆశీర్వదించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సభకు 20 వేల మంది జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం, మధిరలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, బోగ్యం ఇందిర, వెలగపుడి శివరాంప్రసాద్, మల్లాది వాసు, మూడ్ ప్రియాంక, రంగిశెట్టి కోటేశ్వరరావు, చీదిరాల వెంకటేశ్వర్లు, యన్నం కోటేశ్వరరావు, వేమిరెడ్డి లకా్ష్మరెడ్డి, మధిర నగర పంచాయతీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, తోటపల్లి సుధాకర్, సాంబశివరావు, లంకెల ఆదినారాయణరెడ్డి, గుగులోతు కృష్ణానాయక్, వెలగపుడి శివరాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ పొంగులేటి
ఈ నెల 14న మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మధిరలో నిర్వహించనున్న బహిరంగసభా ప్రాంగణాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు.ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, వెలగపుడి శివరాంప్రసాద్, బాహాటం శ్రీనివాసరాజు, యన్నంశెట్టి వెంకటఅప్పారావు, యన్నం కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...