అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్శితులవుతున్నారు...


Mon,November 12, 2018 11:53 PM

ఎర్రుపాలెం, నవంబర్ 12 : కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ఆకర్శితులై పలుపార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సోమవారం కాంగ్రెస్, టీడీపీల నుంచి కొట్టేటి వెంకట్రామిరెడ్డి, యరమల రాజశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని టీఆర్‌ఎస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల మనిషి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి లింగాల కమలరాజును గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతికార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, భద్రాచలం ట్రస్టుబోర్డు మాజీచైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గూడూరు రమణారెడ్డి, పంబి సాంబశివరావు, శీలం వెంకట్రామిరెడ్డి, నాగేశ్వరరావు, రవి, తిరుపతిరావు, బొల్లయ్య, వేమిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, వేముల వెంకటేశ్వరరావు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, రాంచంద్రం, అంబటి నాగిరెడ్డి, కొత్తపల్లి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

రొంపిమల్ల గ్రామంలో 20 కుటుంబాలు చేరిక..
మధిర, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని రొంపిమల్ల గ్రామంలో కల్యాణం ముసిలి, మడుపల్లి కొండయ్య, శీలం కృష్ణారెడ్డి, కళ్యాణం రమేష్‌తోపాటు కాంగ్రెస్, సీపీఎం పార్టీల నుంచి 20కుటుంబాలు లింగాల కమలరాజు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి టీఆర్‌ఎస్ కండువా కప్పి ఆయన సాదరంగ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర మండల అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, వేమిరెడ్డి లకా్ష్మరెడ్డి, చీదిరాల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, వెంకట్రామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకట్రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...