అందుబాటులో ఉంటా... ఆశీర్వదించండి


Mon,November 12, 2018 11:53 PM

మధిర, నమస్తేతెలంగాణ, నవంబర్ 12 : ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొంటూ తనను ఆశీర్వదించాలని మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు కోరారు. సోమవారం మండల పరిధిలోని మల్లారం, రొంపిమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి కావాలా అనే విషయం ఆలోచించి టీఆర్‌ఎస్ పార్టీ కారుగుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, వేమిరెడ్డి లకా్ష్మరెడ్డి, చీదిరాల వెంకటేశ్వర్లు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, కారుమంచి రాజశేఖర్, మందడపు రామకృష్ణ, వెలగపుడి శివరాంప్రసాద్, పీఆర్‌సాహేబ్, గూడూరు సత్యనారాయణరెడ్డి, ముక్కర వెంకట్రామిరెడ్డి, వెంకట్రామయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల కోసం పనిచేసే కమలన్నను గెలిపించాలి
బోనకల్లు : నిత్యం ప్రజల కోసం పనిచేసే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి కమలన్నను గెలిపించుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం మండలంలోని బ్రాహ్మణపల్లి, కలకోట, రాయన్నపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమలరాజు గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున పూలుజల్లుతూ ఘనస్వాగతం పలికారు. డప్పువాయిద్యాలతో, కోలాట దళాలతో గ్రామాల్లోని వీధుల్లో రోడ్‌షో చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు మందడపు తిరుమలరావు, మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, వైస్‌ఎంపీపీ వంగల సీత, నిమ్మతోట కానా, గాదే నర్వోత్తమరెడ్డి, బండి వెంకటేశ్వర్లు, తమ్మారపు బ్రహ్మయ్య, రామిశెట్టి రవి, తెరాల రఘుపతి, షేక్ గాదే కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...