నిజాయితీకి మారుపేరు గొల్ల-కురుమలు

Mon,November 12, 2018 01:38 AM

-కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చిన మహానేత కేసీఆర్
-ఆత్మీయ సభలో రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్
రఘునాథపాలెం : గొల్ల-కురుమలు నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుస్తారని రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరం ఇల్లెందురోడ్డులో గల మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఖమ్మం నియోజకవర్గ స్థాయి గొల్ల-కురుమల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణలో అంతరించినపోయిన కులవృత్తులకు పూర్వవైభవం తీసుకవచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అన్నారు. 70ఏళ్లు పాలించిన సీమాంధ్ర పాలకుల హయాంలో యాదవ-కురుమలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవ-కురుమల కోసం రూ.10వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై గొర్రెలను అందించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక శాతంగా ఉన్న గొల్ల-కురుమలు టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేసి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి పరితపించే టీఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపులో యాదవ-కురుమల పాత్ర కీలకం కావాలన్నారు.

తెలంగాణ రక్షకుడు కేసీఆర్..
పోరాడి సాధించుకున్న తెలంగాణకు రక్షకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే గొల్ల-కురుమలకు గుర్తింపు లభించిందన్నారు. నియోజకవర్గానికి వెన్నుముఖగా ఉన్న గొల్ల-కురుమలు ఈ ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి పార్టీ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సభలో భాగంగా గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య చేతుల మీదుగా పువ్వాడ అజయ్ కుమార్‌కు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ సభకు కార్పొరేటర్ పగడాల నాగరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ బాలసాని, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్, తెలంగాణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం యాదవ్, కురుమల సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగ నాగులు, చిన్న మల్లేశం, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, చేతుల నాగేశ్వరరావు, కృష్ణ మోహన్, కాటం కొమరయ్య, తొట్టి వెంకన్న, పొదిల పాపారావు, చిలకల వెంకటేశ్వర్లు, లిక్కి కృష్ణారావు, దుబాకుల వెంకన్న, దేవర శ్రీను, నన్నెబోయిన పద్మ, పొదిల గిరి, బొమ్మిడి శ్రీనివాస్, పేడేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles