ఉమ్మడి జిల్లాలో పదికి పది గెలుస్తాం..

Mon,November 12, 2018 01:37 AM

-కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : మాజీ మంత్రి జలగం, మువ్వా..
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ విజయానికి దోహదపడతాయని, దీనిద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి తీరుతామని మాజీమంత్రి జలగం ప్రసాదరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు ప్రభాకరరావు నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, బీమా, గొర్రెలు, చేపలు పంపిణీల ద్వారా రైతులు, కుల సంఘాల్లో ఆత్మైస్థెర్యం నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.1.16లక్షలు అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, డీసీసీబీ చైర్మన్, అభ్యర్థి పిడమర్తి రవి, డాక్టర్ మట్టా దయానంద్‌లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన సత్తుపల్లి నియోజకవర్గంలో పిడమర్తి రవి గెలుపు భారీ మెజార్టీగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు ఉచిత నర్సింగ్ శిక్షణ..
జిల్లాలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థినులకు నర్సింగ్‌లో ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తూ వారందరికీ ఉద్యోగంలో స్థిరపడేలా సహాయపడతానని జలగం ప్రసాద్ హామీ ఇచ్చారు. ఏడాదికి రూ.5,500 ఫీజు చెల్లించినట్లయితే ఎంతమంది విద్యార్థినులైనా ఈ శిక్షణకు హాజరు కావచ్చన్నారు. ఈ సమావేశంలో నాయకులు కోటగిరి ఆనందగజపతిరావు, అమరవరపు కృష్ణారావు, తుమ్మూరి శ్రీను, అమీర్‌జానీ, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, నాగళ్ల ప్రసాద్, బొంతు వేణు, ఐ శ్రీను, ఐ కృష్ణలతోపాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles