14న మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నామినేషన్

Mon,November 12, 2018 01:37 AM

మధిర, నమస్తేతెలంగాణ, నవంబర్11: ఈనెల 14న మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమల్‌రాజ్ మాట్లాడుతూ ఈనెల 14న మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి శాఖ చైర్మన్ బుడాన్ బేగ్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్, మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి తదితర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం మధిర పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో భారీ బహిరంగసభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి, తనను ఆశీర్వదించాలని కోరారు.

348
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles