ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు


Mon,November 12, 2018 01:35 AM

ఎర్రుపాలెం, నవంబర్11: మండల కేంద్రంలోని సెయింట్ విన్నెస్ పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి మొత్తం 200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. ముగింపు కార్యక్రమానికి ఎర్రుపాలెం ఎస్సై వీ సురేష్, ఎంఈవో వై ప్రభాకర్ ముఖ్యఅతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మండలంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. బాలుర విభాగంలో మొదటి బహుమతి ఎండీ సుజాయిత్(మహబూబ్‌నగర్), ద్వితీయ బహుమతి యాసిన్(మహబూబ్‌నగర్), తృతీయ బహుమతి బీ గణేష్(వరంగల్)లు గెలుచుకున్నారు. బాలికల విభాగంలో కే హేమలత(మహబూబాబాద్), ఐ శివలీల(మహబూబాబాద్), కే అనిత(మహబూబాబాద్), పీ మల్లీశ్వరి(మహబూబాబాద్), బీ నాగమణి(నాగర్‌కర్నూల్), వై యాదమ్మ(మహబూబ్‌నగర్), కే మనీష(ఖమ్మం), కే సంధ్య(మహబూబ్‌నగర్)లు బహుమతులు సాధించారు. గెలుపొందిన విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్బత్‌వలీ, అక్బర్, ఏవో యాదయ్య, లక్ష్మీకాంతం, బీ శ్రీనివాసరెడ్డి, పీవీవీ సత్యనారాయణరెడ్డి, ఎం జమలయ్య, వీ చిన్ని, శ్రీహర్ష, డీ సత్యనారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, సునీల్, కోటారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...