సమన్వయంతో పనిచేస్తే భారీ మెజార్టీ

Sun,November 11, 2018 04:21 AM

- మాజీ మంత్రి జలగం, పిడమర్తి, మువ్వా
- పిడమర్తి గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి..
తల్లాడ, నవంబర్10: సమన్వయంతో పనిచేస్తే సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి జలగం ప్రసాద్, ఎస్సీకార్పొరేషన్, సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు, దిశాకమిటీ సభ్యులు మట్టా దయానందవిజయ్‌కుమార్ అన్నారు. శనివారం తల్లాడలోని జీఎన్‌ఆర్. గార్డెన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోనే బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. ప్రతి మనిషి సైనికుడిలా పనిచేసి పిడమర్తి రవి గెలుపునకు కృషిచేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో గ్రూపులకు తావులేకుండా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలే పిడమర్తి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. గ్రామాల్లో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే ప్రతిఒక్కరికీ మంచి గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీమంత్రి జలగం ప్రసాదరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పని చేస్తున్నారన్నారు.

సమన్వయంతో పనిచేసి తల్లాడ మండలంలో భారీ మెజార్టీ తీసుకురావాలన్నారు. మరోసారి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జక్కంపుడి కృష్ణమూర్తి, రైతుసమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ యరమల వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మూకర ప్రసాద్, మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్‌లాల్, మండల నాయకులు మోదుగు ఆశీర్వాదం, నల్లబోతు రామారావు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, దుండేటి వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్ బోడజ్ల దిలీప్, అన్నెం వెంకటేశ్వరరెడ్డి, శీలం కృష్ణారెడ్డి, బద్ధం కోటిరెడ్డి, షేక్ హుస్సేన్, తుమ్మలపల్లి రమేష్, అయిలూరి సత్యనారాయణరెడ్డి, కోడూరి వీరకృష్ణ, గుర్రం వెంకటేశ్వరరావు, పోట్రు శరత్‌బాబు, అనుమోలు బుద్ధిసాగర్, జంగా సత్యనారాయణరెడ్డి, కోడూరి రాము, వెంకటమైబు, పోతురాజు కోటయ్య, ఇనపనూరి సీతయ్య, పోట్రు శ్రీనివాసరావు, గణేషుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles