వనసమారాధనలు ఐక్యతకు దోహదపడతాయి

Sun,November 11, 2018 04:20 AM

- సకల ఉద్యోగుల వనసమారాధనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..
రఘునాథపాలెం, నవంబర్ 10: నిత్యం విధి నిర్వహణలో, కార్యాలయాల్లో బిజీ బిజీగా గడిపే ప్రభుత్వ ఉద్యోగులు కార్తీకమాసాన ఒక్కటయ్యారు. కుటుంబ సమేతంగా వనంలో ఒక వేదికగా కలుసుకున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని చెరుకూరి వారి తోటలో ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల సమ్మేళనం సందడి సందడిగా సాగింది. జిల్లాలో పని చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు వనమహోత్సవాన కుటుంబంతో వచ్చి సందడిగా గడిపారు. ఈకార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి తుమ్మలను ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, పొట్టపింజర రామయ్య, మల్లేల రవీంద్రప్రసాద్, కోడిలింగయ్యలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్తీకమాసాన్ని పురస్కరించుకొని నిర్వహించే వనసమారాధనలు ఐక్యతకు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్తీక మాసంలో ఉద్యోగులందరూ వనంలో కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం మంత్రి తుమ్మలను ఉద్యోగ సంఘాల నాయకులు పూలవాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. వనసమారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక సాంస్కృతిక కార్యక్రమాలతో దద్దరిల్లిపోయింది. కళాకారుల ఆటపాటలు, జానపద కళారూపాలు, భరతనాట్యం, సినిమా పాటల స్టెప్పులతో సభా ప్రాంగణం మార్మోగింది. వనసమారాధనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలుసుకున్న ఉద్యోగులు తమ ఆత్మీయ పలకరింపుల నడుమ రోజంతా వనంలో సరదాగా గడిపారు. వనమహోత్సవంలో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో శివలింగ దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వనసమారాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, జర్నలిస్టులకు చెందిన కుటుంబాలు సుమారు 12వేల మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు గంగవరపు బాలకృష్ణ, హకీం, వల్లోజి శ్రీనివాసరావు, కొమరగిరి దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, బుల్లెట్ శ్రీను, బసవరాజు శ్రీకాంత్, ఎం.గోపాల్, గుంటుపల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీకాంత్, ప్రకాశ్, గౌస్, రామణయాదవ్, రమేష్, శ్రీధర్, దస్రు, వెంకటనర్సమ్మ, శ్రీదేవి, లలిత, భారతి తదితరులు పాల్గొన్నారు.

199
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles