ఆనంద(ది)వాలీ..


Fri,November 9, 2018 01:10 AM

(ఖమ్మం కల్చరల్) మతాబులు వెలుగులు నింపాయి. తారాజువ్వలు ఆకాశన్నంటాయి. కాకరపూవులు మిరుమిట్లు గొలిపాయి. చిచ్చుబుడ్లు చీకట్లను చెరిపేశాయి. ఇలా ఒకటేమిటి.. ఆనాడు నరకాసురుణ్ని వధించడానికి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు సంధించిన అనేక అస్త్రశస్ర్తాల ప్రతీకలు గగన విహారం చేశాయి. నిండు అమావాస్యను చీల్చుతూ కాంతిపుంజాలు వెల్లివిరిసాయి. అజ్ఞానాంధకారం నుంచి జ్ఞాన జ్యోతికి మార్గం చూపే, చీకటి నుంచి వెలుగుకు దారి చూపే దివ్య వెలుగుల దీపావళి పండుగను అశ్వీయుజ బహుళ అమావాస్య బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. జిల్లాలోని పలు శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సంధ్యాసమయంలో ప్రమిదలలో నూనెతో దీపాలను వెలిగించడంతో వీధులన్నీ దీపతోరణాలై కాంతులు వెదజల్లాయి. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పటాకులు కాల్చి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వసంతలక్ష్మి దంపతులు; జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత; ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ; టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు బాణోతు చంద్రావతి; ఆర్‌జేసీ కృష్ణ తదితర ప్రముఖులు దివ్య దీపాలు వెలిగించి పటాకులు కాల్చి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...