2.92 లక్షల మందికి కంటి పరీక్షలు: డీఎంహెచ్‌ఓ


Fri,November 9, 2018 01:09 AM

కామేపల్లి, నవంబర్ 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరంలో జిల్లాలో 2,92,544 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. మండలంలోని జాస్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా అందించే మందులు, కంటి అద్దాలు పొందాలని కోరారు. కంటివెలుగుతో కంటి సమస్యలు దూరమవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 70,256 మందికి కళ్లద్దాలు అందించామని, మరో 48,320 మందికి కళ్లద్దాలు అర్డర్ చేశామని అన్నారు.19,927 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందన్నారు. 434 మందికి కంటి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించామని వివరించారు. కంటి వెలుగు శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కంటి పరీక్షల కోసం వచ్చే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, కంటి వైద్యనిపుణులు డాక్టర్ మణికుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, సూపర్‌వైజరు రాజశేఖర్, రాజు, అరుణ, నవత తదితరులు పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...