సేవకుడిలా పనిచేస్తా..

Wed,November 7, 2018 01:30 AM

వైరా, నమస్తే తెలంగాణ : ఆదరించి గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని వైరా టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ అన్నారు. మంగళవారం వైరాలో వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మహిళలు మదన్‌లాల్‌కు బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైరాలోని బ్రాహ్మణపల్లి, ఫిషరీస్ కాలనీ, మాటూరిపేటతో పాటు ప్రధాన రహదారుల వెంట ఆ షాపుల్లో ఇంటింటా మదన్‌లాల్ విస్తృత ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను మదన్‌లాల్ అభ్యర్థించారు. వైరాలో మదన్‌లాల్ తాపీ పట్టుకొని తాపీ కార్మికుడిగా గోడ నిర్మిస్తూ, మంగళ దుకాణంలో ఓ వ్యక్తికి షేవింగ్ చేస్తూ, చికెన్ షాపులో చికెన్ కొడుతూ, వెల్డింగ్ దుకాణంలో వెల్డింగ్ పెడుతూ, ఐరన్ కడ్డీలకు మిషన్‌తో రంధ్రాలు వేసే పనులు చేస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మదన్‌లాల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ తన్నీరు జ్యోతి, నాయకులు నూకల ప్రసాద్, కొణతాలపల్లి వెంకటసుబ్బారావు, మిట్టపల్లి సత్యంబాబు, వజినేపల్లి చక్రవర్తి, సూర్యదేవర శ్రీధర్, తాతా నిర్మల, గుజ్జర్లపూడి దేవరాజు, బానోత్ క్రిష్ణ, మాదినేని సునీత, వేముల రత్నాకర్, తన్నీరు క్రిష్ణవేణి, పమ్మి తిరుమలరావు, ఏడునూతల బుచ్చిరామారావు, పర్సా వెంకటగౌడ్, వల్లెపు రాము, పూర్ణకంటి రామారావు, షేక్ కౌసర్, సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles