కా్రంగెస్, టీడీపీలది అనైతిక పొత్తు..!


Tue,November 6, 2018 12:24 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, నవంబర్ 5: మహాకూటమి పేరుతో టీడీపీ , కాంగ్రెస్‌లు అనైతక పొత్తుతో ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని వారి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెరాసా అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. సోమవారం మండల పరిధి రుద్రాక్షపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జిల్లాకే తలమానికమైన సీతారామ ప్రాజెక్ట్‌ను అతి త్వరలో పూర్తి చేసి గోదావరి జలాలను సత్తుపల్లికి తరలించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారనిఅన్నారు. 13 వేల కోట్లుతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లగుళ్ళ నరిసంహారావు, తుమ్మూరి శ్రీను, నాగళ్ళ ప్రసాద్, బోంతు మాధవరావు, అమరవరపు కృష్ణారావు, ప్రసాదరెడ్డి, దుర్గా ప్రసాద్, మోదుగు పుల్లారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, పువ్వాళ ఉమా, కిలారి వెంకటేశ్వరరావు, మోరంపూడగి సత్యనారాయణ, దారావత్ కృష్ణ, దారావత్ నాగేశ్వరరావు, దారావత్ శరత్, తమ్మిన రవి, పల్లే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...