ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆదర్శం

Tue,November 6, 2018 12:23 AM

-టీఆర్‌ఎస్‌లో పలు కుటుంబాల చేరిక
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది ,సంక్షేమ పథకాలే పేద ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎన్నికల ఇంచార్జి నూకల నరేష్‌రెడ్డిలు అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని 15వ వార్డులో 20 కుటుంబాలు వారి సమక్షంలో పార్టీలో చేరగా వారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది ఫలాలే పార్టీ గెలుపుకు శ్రీరామరక్ష అన్నారు. అదే విధంగా మండల పరిధి తుమ్మూరు గ్రామంలో సోమవారం రాత్రి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఎన్నికల ఇంచార్జి నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో 40 కుటుంబాల వారుటీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండల పరిధి సిద్ధారంలో 50 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లగుళ్ళ నరిసంహారావు, గాదే సత్యం ,మోరంపూడి ప్రభాకర్ సత్యనారాయణ, మరిడి హరికృష్ణ, భ్రహ్మం, పూచిన కృష్ణ, వాకా సతీష్, రేగుల గంగులు, తోటకూర రాధ, సునీత, మదు, లక్ష్మణ్‌రావు, రేగుల రాంబాబు, హరీష్, ఆముదాల రాములు, వాసం కృష్ణయ్య, మారేష్, పెద్దులు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లగుళ్ళ నరిసంహారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, కోటగిరి మురళి, తుమ్మూరి శ్రీను, నాగళ్ళ ప్రసాద్, బోంతు మాధవరావు, మట్టా ప్రసాద్ , దొడ్డాకుల గోపాలరావు, గఫార్,రవి, సాగర్, చల్లపల్లి కుమారి, నాగేశ్వరరావు, నిహారిక, బేగం, లకా్ష్మచారి, రమాదేవి,మేరి తదితరులు పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles