టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం-అభివృద్ధిని కొనసాగిద్దాం

Mon,November 5, 2018 01:51 AM

-ఎర్రుపాలెం, బోనకల్లు ప్రచారాల్లో ఎంపీ పొంగులేటి..
-రోడ్‌షోలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు
-మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలంటున్న రాష్ట్ర ప్రజానీకం
-అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి లింగాల కమల్‌రాజ్
ఎర్రుపాలెం, నవంబర్4: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గెలిపించి అభివృద్ధిని కొనసాగిద్దామంటూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజు, మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి, స్థానిక నాయకులతో కలిసి ఎర్రుపాలెం, తెల్లపాలెం, జమలాపురం, వెంకటాపురం, తక్కెళ్లపాడు, రామన్నపాలెం, గట్లగౌరవరం గ్రామాల్లో రోడ్‌షో, బైక్‌ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో ప్రసంగించారు. నాయకులకు మహిళలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. రామన్నపాలెం, తక్కెళ్లపాడు, గట్లగౌరవరం గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి సుమారు 150 కుటుంబాలు వారు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాలను చూసి వివిధ రాజకీయ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆకర్శితులై పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అత్యధిక ప్రజానికం కోరుకుంటున్నారన్నారు. మధిర నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానాయకుడు అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. మండలానికి ప్రధాన ఆయకట్టు కట్టలేరు ప్రాజెక్టుకు లిఫ్ట్‌ఇరిగేషన్ తీసుకొచ్చి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తక్కెళ్లపాడు దళిత శ్మశానవాటికకు సీసీరోడ్డు ఏర్పాటుతో పాటు, అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, భద్రాచలం ట్రస్టుబోర్డు మాజీచైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, వేమిరెడ్డి లకా్ష్మరెడ్డి, మొండితోక జయాకర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గూడూరు రమణారెడ్డి, పంబి సాంబశివరావు, శీలం వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి త్రివేణి, శ్రీకాంత్‌రెడ్డి, బాలరాఘవరెడ్డి, అనిమిరెడ్డి, పవన్, లకా్ష్మరెడ్డి, శీలం అక్కమ్మ, రవీంద్రారెడ్డి, తలపుల విజయబాబు, పెద్దసిద్ధారెడ్డి, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ముల్పూరి శ్రీనివాసరావు, చొప్పవరపు శ్రీనివాసరావు, మురళీధర్, వేముల వెంకటేశ్వరరావు, పుల్లారెడ్డి, అప్పారావు, నారాయణ, నాగేశ్వరరావు, రవి, సరోజిని, ప్రశాంత్ పాల్గొన్నారు.

212
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles