కారు గుర్తుకి ఓటు వేయండి..

Mon,October 15, 2018 12:58 AM

-టీఆర్‌ఎస్‌లోకి పలు కుటుంబాలు చేరిక
-మదన్‌లాల్ పర్యటనకి ఊరూరా విశేష స్పందన
ఏన్కూరు, అక్టోబర్14 : ఆభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తిని ఆదరించి కారు గుర్తుకి ఓటు వేయండి అని వైరా నియోజకవర్గ టీఆర్‌యస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ అన్నారు. అదివారం మండల పరిధిలో బియన్ తండా, అక్కినపురం తండా, హిమంనగర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వాహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషితో వివిధ సామాజిక వర్గాల వారికి నాయ్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో వైరా నియోజకవర్గంను అభివృద్ధి పధంలో ముందు ఉంచానన్నారు. రానున్న ఏన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బియన్‌తండా, అక్కినపురంతండా తదతరగ్రామాలకు చెందిన 50 గిరిజన కుటుంబాల వారు మదన్‌లాల్ సమక్షం టీఅర్‌యస్ పార్టీలో చేరారు. అనంతరం అక్కినపురం తండాలో మదన్‌లాల్‌కి అండగా ఉంటామని కారు గుర్తుకి ఓటు వేస్తాం అని ప్రతిజ్జ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి) మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా సక్కునాయిక్, గిద్దగిరి సత్యనారయణ, యండ్రాతి మొహన్‌రావు, ఈశ్వరనాయిక్, కట్టా సత్యనారయణ ఉన్నారు.

291
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles