పండుగలా వ్యవసాయం..


Sun,October 14, 2018 02:05 AM

-24 గంటల విద్యుత్‌తో రైతు కుటుంబాల్లో వెలుగులు
నా పేరు బానోత్ అనిల్. బీటెక్ వరకు చదువుకున్నాను. టేకులపల్లి మండలంలోని వంకాయలడాంలో ఉంటాను. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకం నా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి రైతన్నలకు లాభం చేకూర్చే పనులు చేయలేదు. పైసా ఖర్చు కాకుండా అందుతున్న కరెంటుతో నాకున్న రెండెకరాల భూమిలో మూడు రకాల పంటలు పండించుకుంటున్నాను. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నారు. అలాంటిది కేసీఆర్ సారు.. వ్యవసాయాన్ని పండుగలా మార్చేశారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. నావంతుగా కారు గుర్తుకే ఓటు వేస్తాను
టేకులపల్లి: మండలంలోని వంకాయలతండాకు చెందిన బానోతు అనిల్ బీటెక్ చదుకున్నాడు. అతనికున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యసాయానికి అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఏక కాలంలో మూడు పంటలు సాగు చేస్తున్నాడు. బంతి పూలు, గణుసుగడ్డల తోట, పత్తి చేను వేశాడు. బంతిపూల తోట కళకళలాడుతోంది. గణుసుగడ్డల తోట పక్వానికి వచ్చింది. కొద్ది రోజుల్లో పత్తి తీయనున్నారు. ఇలా ఒకేసారి మూడు పంటలతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మంచి ఆదాయం రానుంది. దీంతో ఆ రైతు కుటుంబంలో నిరంతర విద్యుత్, ఆర్థిక వెలుగులను నింపుతోంది. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...