సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..

Sun,October 14, 2018 02:04 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
-మంత్రి తుమ్మల నాగేశ్వరావు
దమ్మపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని గండుగులపల్లిలో ఆయన రెండు జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులతో కలిసి తుమ్మల మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించా లని, ఆ బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.

అదేవిధంగా ఇప్పటికే జిల్లాల వారీగా ఏర్పాటైన బూత్‌కమిటీ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ గుర్తు కారు గుర్తును విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మండలంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదని కొందరు రైతులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికలపైనే దృష్టి సారించిందని, ఎన్నికల అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రతిఒక్కరికీ అందజేయడం జరుగు తుందని, అవి అందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి కూడా త్వరలోనే వాటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకులు బేధాభిప్రాయాలు పక్కనపెట్టి సమష్టిగా రెండు జిల్లాల్లోని టీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషిచేసి విజయానికి సహకరించాలన్నారు. తుమ్మలను కలిసిన వారిలో డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పానుగంటి సత్యం, పోతినేని శ్రీరామవెంకట్రావు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పైడి వెంకటేశ్వరరావు, సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), నాయకులు కాసాని నాగ ప్రసాద్, పానుగంటి రాంబాబు, యార్లగడ్డ బాబు ఉన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles