సమష్టిగా పని చేస్తే విజయం మనదే


Sat,October 13, 2018 12:54 AM

-పినపాక టీఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్,అక్టోబర్12: రానున్న ఎన్నికలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేస్తే టీఆర్‌ఎస్ పార్టీనే విజయం వరిస్తుందని పినపాక టీఆర్‌ఎస్ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సారపాకలో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.టీఆర్‌ఎస్ పార్టీలో స్థానికంగా ఉన్న అభిప్రాయ బేదాలను పక్కనపెట్టి కారకర్తలు, నాయకులు పార్టీ కోసం పని చేయాలని ఆయన అన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఎల్లప్పుడు అధిష్టానం గుర్తిస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపులో బూర్గంపహాడ్ మండలం కీలకమని ఈ విషయాన్ని కార్యకర్తలు గుర్తించి కష్టపడాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కారు గుర్తుకి ఓటు వేసేలా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రాచారంతో పాటు వారు ఇస్తున్న మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. అదే విధంగా శనివారం మణుగూరులో నిర్వహించనున్న పార్టీ నియోజకవర్గం సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వారావు, ఎంపీ సీతారాం నాయక్‌లతో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సూరపాక విజయనిర్మల, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరంరెడ్డ శ్రీనివాసరెడ్డి, తాళ్లూరి పుల్లయ్య చౌదరి, సారపాక పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాండవుల మధు, మర్రి సాంబిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రేస్ నుంచి టీఆర్‌ఎస్‌లో 100 కుటుంబాలు చేరిక
మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లోని అంబేద్కర్ కాలనీకి చెందిన 100మంది కాంగ్రేస్ కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి పాయం వెంకటేశ్వర్లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అధికారం కోసం ఏర్పడిన మహా కూటమి మాయా కూటమిగా మారిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా వుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో మోస పూరిత మాటలతో ప్రజల ముందుకు వస్తున్న ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మవద్దని అన్నారు. కేసీఆర్ సీఎం మళ్లీ కావడం ఖాయమన్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు బతుకమ్మలతో ఘనస్వాగతం పలకిన మహిళలతో బతుకమ్మ ఆడలాడి మహిళలను ఉత్సాహపర్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సూరపాక విజయనిర్మల, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్ఫీటీసీ బట్టా విజయగాంధీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాళ్లూరి పుల్లయ్యచౌదరి, ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరావు, టీఆర్‌ఎస్ నాయకులు పొడియం నరేందర్, తోటమళ్ల భిక్షం, బొర్రా రాఘవులు, జక్కం సుభ్రమణ్యం, బూపల్లి నర్శింహారావు, మారం శ్రీనివాసరెడ్డి, గోనెల నాని, తోకల సతీష్, దాసరి సాంబయ్య, తోకల నాగరాజు, కొమ్ము నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...