డబుల్ స్పీడుతో..


Fri,September 21, 2018 11:53 PM

రఘునాథపాలెం, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని నిరుపేదల కోసం తెలంగాణ సర్కారు చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదల సొంతింటి కళను సాకారం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు నిర్మాణ పనుల వేగాన్ని పెంచి సాద్యమైనంత త్వరగా లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి కేటాయించనన్ని ఇండ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించారు. రెండేళ్ల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలోని అత్యధికంగా పేదలు ఉన్నట్లు గుర్తించి వారందరినీ సొంతింటికి యజమానులను చేయాలనే ఆలోచన చేసి నియోజకవర్గానికి తొలి విడతగా 2వేల ఇండ్లు మంజూరు ఇచ్చారు. 2వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉండగా ఇప్పటికే 250 ఇండ్లు ప్రారంభించుకోగా ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి వారితో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గృహప్రవేశాలను చేయించారు. మిగిలిన ఇండ్లలో 200 ఇండ్లు నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేనికి కేటాయించారు. మిగిలిన వాటిని కార్పోరేషన్ పరిధిలోని నిరుపేదలకు కేటాయించగా వీటిలో టేకులపల్లిలో 1008 ఇండ్లు, వైఎస్‌ఆర్ నగర్‌లో 340 ఇండ్లు, అల్లిపురంలో 160 ఇండ్లు నిర్మాణ దశంలో ఉన్నాయి. వైఎస్‌ఆర్ నగర్ నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లు 90శాతం పనులు పూర్తకాగా త్వరలో ప్రారంభించేందుకు అధికారులు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. అంతేకాక టేకులపల్లిలో చేపడుతున్న 1008 ఇండ్లు దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. అంతేకాక రెండో విడతగా మరో 5 వేల ఇండ్లను మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మంజూరు తీసుకవచ్చారు. కొత్తగా మంజూరైన వాటిలో ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే 7వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి.

పాలెంలో సిద్ధమైన 30 ఇండ్లు..
కాగా రఘునాథపాలెం మండలానికి 200 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారు. వీటిలో జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీకి 20 నుంచి 30వరకు కేటాయించారు. కాగా ఇప్పటికే ఆయా పంచాయితీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. పాపటపల్లిలో 20 ఇళ్లు నిర్మాణం పూర్తి కాగా ఇటీవలే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు. ఇవి కాగా మండల కేంద్రం రఘునాథపాలెం గ్రామానికి కేటాయించిన 30ఇండ్లు నిర్మాణ పనులు పూర్తై రంగులను అద్దుకొని అందంగా ముస్తాబై ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి.

సిద్ధమైన ఇండ్లను పరిశీలించిన అజయ్‌కుమార్
రఘునాథపాలెంలో సిద్దమైన 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లను తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. జీ+2తో చేపట్టిన ఇండ్లు అందంగా ముస్తాబు కావడంతో సంతోషాన్ని వ్యకత చేశారు. ఇండ్ల లోపలకు వెళ్లి పనుల నాణ్యతతో పాటు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ ఇండ్లు నియోజకవర్గంలో వేగంగా సాగుతున్నాయన్నారు. మండల కేంద్రాన్ని దృష్టిలో ఉంచుకొని రఘునాథపాలెం గ్రామానికి మంత్రి కేటీఆర్ మరో 30 ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పూర్తయిన 30 ఇండ్ల వద్దనే మంజూరైన 30 ఇండ్లు కూడా చేపట్టి గేటెడ్ కమ్యునిటీగా తీర్చిదిద్దాలనే మంత్రి కేటీఆర్ చెప్పినట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, మాజీ సర్పంచ్ రెంటాల ప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు బోయిన వెంకటనర్సయ్య, రాయల శ్రీనివాసరావు, కుందే సాహెబ్, బానోతు నాగేశ్వరరావు, చెరుకూరి ప్రదీప్ పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...