మత్స్యకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయూత


Thu,September 20, 2018 12:35 AM

కూసుమంచి, నమస్తే తెలంగాణ : మత్య్సకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కూసుమంచి మండలం పాలేరులోని పీవీ నర్సింహరావు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన మత్స్య కారులకు 25రోజుల పాటు అందించే శిక్షణలో భాగంగా బుధవారం ముఖ్యఅతిధిగా వచ్చిన డీడీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్య కారులకు వలలు తెప్పలు, ద్విచక్రవాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. వాటిని వినియోగించుకోవాలని కోరారు. మత్స్యకారులకు ఉచ్చితంగా చేపపిల్లల పంపిణీతోపాటు అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. వ్యవసాయానికి అనువుకానీ నెలల్లో నీటిని నిల్వ ఉంటే చేపలు పెంచుకోవచ్చునని పేర్కొన్నారు. చేపల పెంపకం ద్వారా ఒక పంటకు రూ.50వేల నుంచి 60వేల ఆదాయం వస్తుందన్నారు. చెరువుల నిర్మాణాలు కావాల్సినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మత్స్యశాఖ అధికారి చేపల పెంపకానికి అనుణుగా ఉందా లేదా అనేది పర్యవేక్షించిన తరువాతనే మంజూరు జరుగుతుందన్నారు. ఎకరా చెరువులో 4 అడుగుల లోతు ఉంటే చాలునని అన్నారు. జవహర్ నవోదయ ఉపాధ్యాయులు చంద్రశేఖరశాస్త్రీ మాట్లాడుతూ అందిస్తున్న శిక్షణలో కావాల్సిన వాటిని తెలుసుకోవటంతోపాటు సమస్యలు ఉంటే తీర్చుకోవాలని కోరారు. మత్స్య శాస్త్రవేత్త శాంతన్న మాట్లాడుతూ స్థలాన్ని నీటి వసతిని విద్యుత్ అవసరాలను గుర్తించాలని కోరారు. రెండవ రోజు... : క్షేత్రస్థాయిలో సందర్శనార్ధం పాలేరు జలాశయంలో పంజర వల చేపల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పంజర చేపల పెంపకం వాటికి దాణ, వాటి యాజమాన్య పద్ధతులను మత్స్య కారులకు శాస్త్రవేత్త శాంతన్న వివరించారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...