సండ్రకు డిపాజిట్లు దక్కనివ్వం..

Thu,September 20, 2018 12:35 AM

-21న సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ
ముఖ్యకార్యకర్తల సమావేశంలో పిడమర్తి రవి
తల్లాడ, సెప్టెంబర్19: ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా ఈనెల 21న సత్తుపల్లిలోని చల్లగుండ్ల కృష్ణయ్య గృహంలో సత్తుపల్లిలో నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి పిడమర్తి రవి అన్నారు. బుధవారం తల్లాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు 5 మండలాల్లోని టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, రైతుసమన్వయ సమితి కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలి కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్ధేశం చేస్తారన్నారు. ఆంధ్రా పార్టీ తొత్తుగా మారి చంద్రబాబు బొమ్మతో ప్రచారానికి వస్తే సండ్ర వెంకటవీరయ్యకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని, పోలింగ్‌బూత్‌లలో ఏజెంట్లు కూడా కుర్చొనే పరిస్థితి లేరన్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటువేసేందుకు ప్రజలు ఉవ్విల్లుతున్నారని, త్వరలోనే సండ్ర వెంకటవీరయ్య అధికార నివాసం ఖాళీ చేయడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ సరికొండ లక్ష్మీపద్మావతి, జడ్పీటీసీ మూకర ప్రసాద్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, మండల నాయకులు దుండేటి వీరారెడ్డి, కోడూరి వీరకృష్ణ, కోడూరి రాము, మోదుగు ఆశీర్వాదం, గుంటుపల్లి నరసింహారావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, లాజర్ పాల్గొన్నారు.

243
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles