టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు దేశంలోనే ఉన్నత స్థానం

Wed,September 19, 2018 01:49 AM

-ఆయిల్‌పాం సాగుకు గాడ్‌ఫాదర్ మంత్రి తుమ్మలే
-ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
దమ్మపేట, సెప్టెంబరు 18 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుగా ఆయిల్‌ఫెడ్‌కు రూ.10కోట్లు ఇవ్వడంతో పాటు 90 కోట్లకు గ్యారంటీగా ఉండి మండల పరిధిలోని అప్పారావుపేట కర్మాగారాన్ని రూ.100 కోట్లతో నిర్మించారని, దీని ఫలితంగా టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు భారతదేశంలోనే అత్యున్నత స్థానం దక్కిందని టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పామాయిల్ తోటలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్‌తో కలిసి అప్పారావుపేట ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయిల్‌పాంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాడ్‌ఫాదర్ అని చైర్మన్ పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పరిశ్రమలన్నీ నిర్వీర్యమయ్యాయని, అందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణం అన్నారు.

గతంలో మహబూబ్‌నగర్ జిల్లా బీచ్‌పల్లిలోని 93ఎకరాల్లో ఉన్న వేరుశనగ కర్మాగారాన్ని లాకౌట్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆయిల్‌ఫెడ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రధానంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఈ అభివృద్ధి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అత్యధిక ఆయిల్ రికవరీ 1843తో దేశంలోనే అధిక ధర తెలంగాణ పామాయిల్ రైతాంగానికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఇందులో కర్మాగారం అభివృద్ధికి రైతులు సైతం బాధ్యత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన రైతు భువన సుందర్‌రెడ్డి తమ గ్రామంలో వేబ్రిడ్జి ఏర్పాటుకు భూమి కొనుగోలు చేసి ఇచ్చామని, అయితే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో ఆ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. దమ్మపేటకు చెందిన దారా తాతారావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా రైతులకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెంచలేదని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడంతో దీనికి చైర్మన్ స్పందిస్తూ త్వరలోనే ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెంచుతామని హామీ ఇచ్చారు. తొలుత చైర్మన్ రెండు మండలాల్లో పర్యటించి పామాయిల్ తోటలను పరిశీలించారు. అనంతరం పామాయిల్ రైతుసంఘం నాయకులు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఎంపీపీ అల్లం వెంకమ్మ, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పైడి వెంకటేశ్వరరావు, సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఆత్మ చైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం కార్యదర్శి శీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డిలతో పాటు రెండు మండలాల పామాయిల్ రైతులు పాల్గొన్నారు.

పామాయిల్ రైతులు ఉద్యోగులతో సమన్వయంతో ఉండాలి : ట్రైకార్ చైర్మన్ తాటి
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్ సాగుచేసే రైతులు ఉద్యోగులు ఎంతో సమన్వయంతో వ్యవహరించాలి. అప్పుడే వచ్చిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ పామాయిల్ కర్మాగారం నిర్మాణానికి ఎంతో ప్రోత్సహించారు. మంత్రి తుమ్మల సహకారంతో ఇంత పెద్ద కర్మాగారాన్ని మన మండలంలో నిర్మించుకోవడం మన అదృష్టం. ఈ కర్మాగారం ద్వారా పామాయిల్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలోనే అతిపెద్ద కర్మాగారంగా అప్పారావుపేటకు సముచిత స్థానం దక్కింది.

174
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles