సీతారామ ముంపు రైతులకు న్యాయం చేస్తాం


Wed,September 19, 2018 01:48 AM

-ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య
టేకులపల్లి : సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య ముంపు రైతులకు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని సీతారామ ప్రాజెక్టు ముంపు గ్రామాలు రోళ్ళపాడు, రుక్మాతండా, బీల్యాతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి మాజీ సర్పంచ్‌లు, నాయకులు, టీఆర్‌ఎస్ శ్రేణులు భా రీగా తరలివచ్చారు. ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో కనకయ్య మాట్లాడారు. నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వారి తో చర్చించారు. ఈ సందర్భంగా రోళ్ళపాడులో గ్రామస్తులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న బాధిత రైతులు తమ గోడును కోరంకు వినిపించారు. స్పందించిన కోరం కనకయ్య, వారికి పూర్తి హామీ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయదని, అందుకు తాను బాధ్యతగా ఉంటానని ఆయన అన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ లక్కినేని సురేందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు వెలదండి సత్యనారాయణ, బానోతు రామా, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...