గోళ్లపాడు సమస్యకు శాశ్వత పరిష్కారం..


Wed,September 19, 2018 01:47 AM

-కొనసాగుతున్న చానల్ ఆధునికీకరణ పనులు
-రూ.70 కోట్ల నిధులతో మారనున్న రూపురేఖలు
-పైపులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యేఅజయ్,
-మేయర్ డాక్టర్ పాపాలాల్
ఖమ్మం, నమస్తేతెలంగాణ: గోళ్లపాడు చానెల్ పనులు వేగిరం అయ్యాయని ఇందులో భాగంగా మురుగునీటిని తరలించే పైపులు ఖమ్మం నగరానికి చేరి అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కమార్ అన్నారు. మంగళవారం మేయర్ పాపాలాల్‌తో కలిసి వాసవీ గార్డెన్ వద్ద నిల్వ ఉంచిన పైపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ గోళ్లపాడు చానెల్ మొత్తం కెనాల్ పొడవు 13 కిలోమీటర్ల మేర ఉంటుందని దానికి సరిపడా, ఎక్కువ కాలం మన్నిక కోసం నాణ్యమైన సల్ఫేట్ రెసిస్టేంట్ పైప్స్ పైపులు అందుబాటులో ఉన్నాయన్నారు. మే నెల నుంచే గోళ్లపాడు అభివృద్ధి పనులు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయన్నారు. మురుగునీరు, వర్షపునీరు వేర్వేరుగా ప్రవహించే విధంగా చానల్ ఆధునికీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. చానల్ ఆధునికీకరణ పనులు ప్రారంభించిన తొలి సంవత్సరం డీషిల్టింగ్ ద్వారా కాల్వలో ఉన్న మురుగు మొత్తాన్ని తొలగించడం జరిగిందన్నారు. దీని వలన వర్షాకాలంలో గోళ్లపాడు చానల్ పరిసర ప్రాంతాలు ఎటువంటి ముంపునకు గురి కాలేదన్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయితే మురుగునీరు పూర్తిగా అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్లిపోతుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు త్రీటౌన్ ప్రాంత ప్రజలకు వరం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డీఈ రంజిత్ కుమార్, కార్పొరేటర్లు పోతుగంటి వాణి, తోట రామారావు, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, నాయకులు కొప్పెర ఉపేందర్, పోతుగంటి ప్రవీణ్, కనకం భద్రయ్య, తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...