నిత్యం ప్రజల మధ్యే ఉన్నా..

Wed,September 19, 2018 01:46 AM

-ఖమ్మాన్ని అగ్రభాగాన నిలపాలనేదే నా ఆకాంక్ష
-మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం వైరారోడ్: అభివృద్ధిలో ఖమ్మం నగరాన్ని తెలంగాణలోనే నెంబర్‌వన్‌గా నిలపాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, దానికి అనుగుణంగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని 16వ డివిజన్ సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్న నాలుగేండ్లలో అన్ని డివిజన్‌లలోని ప్రతి గడపకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశానన్నారు. డివిజన్లలో పర్యటించేటప్పుడు ప్రజలు చూపించిన ఆదరణ మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. డివిజన్లలో స్వయంగా కాలినడకన తిరిగి సమస్యలు తెలుసుకొని అనేక సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయం చెప్పారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌లు అనేక మందికి స్వయంగా అందించానన్నారు. నాలుగేండ్ల క్రితం ఇరుకు రోడ్లు, మురుగుతో వీధులతో ఉన్న ఖమ్మాన్ని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిరోజు నుంచే సుందర నగరంగా తీర్చిదిద్దానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, నాగండ్ల కోటి, నాయకులు తాజ్ ఉద్దీన్, రెహమాన్, రామారావు, రాజేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

170
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles