రైతు ఆత్మహత్య : బీమా వర్తింపు

Wed,September 19, 2018 01:45 AM

బూర్గంపహాడ్,సెప్టెంబర్ 18: వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం లేకపోవటంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపహాడ్‌కు చెందిన బాసిబోయిన శ్రీను(43) తనకు ఉన్న ఎకరమున్నర పొలంతోపాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వరి పంటలను సాగుచేస్తున్నాడు. నిరుడు వ్యవసాయం కోసం రూ.8 లక్షల వరకూ అప్పు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవటంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం తన ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా మృతుని కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా పరిహారం అందనుంది. మృతుడి కుటుంబాన్ని బూర్గంపహాడ్ తహాసీల్దార్ జే.స్వర్ణ పరామర్శించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

134
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles