పల్లెల్లో ప్రచార హోరు..


Tue,September 18, 2018 01:30 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ:టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రతీ నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. ప్రతి గడప తొక్కుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ టీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓటేయాలో తెలియజెపుతున్నారు.. ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించే చర్చించుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ఇన్ని పథకాలను అమలు చేస్తుందా? గత ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు పెట్టాయో మేము చూడలేదా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రతీ పథకం అద్భుతమని కితాబిస్తున్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కీలకమవుతాయని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు, మహిళా సంఘాల బాధ్యులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు తోడుగా ఉంటామని తీర్మానించుకుంటున్నారు.

పలు పార్టీల నుంచి చేరికలు..
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో చింతకాని మండలం బొప్పారం నుంచి 60 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. కారేపల్లి మండలం గాంధీనగర్ నుంచి 100 కుటుంబాలు వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ సమక్షంలో గులాబీ గూటికి చేరాయి. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కారు గుర్తుకే ఓటు వేస్తామని ముకుమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. కల్లూరులో సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి ప్రచారం నిర్వహించి పలు చోట్ల వినయకునికి పూజలు నిర్వహించారు. బోనకల్లు మండలంలో లింగాల కమల్‌రాజ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులకు మహిళలు నుదుట తిలకం దిద్ధి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందిన లబ్దిదారులు అధికార అభ్యర్ధుల తరుపున అనధికారికంగా ప్రచార పర్వంలో ఉన్నారు. సంక్షేమ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని పదిమందికి చాటి చెబుతున్నారు. అపవిత్ర కలయికతో అధికారంలోకి రావటమే ధ్యేయంగా ఎన్నికలు వచ్చినప్పుడే తాము గుర్తొచ్చే నాయకులకు ఓటు వేయకూడదని ప్రజలు తీర్మానించుకుంటున్నారు.

రఘనాథపాలెం మండలంలో అజయ్ సమావేశం..
సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయ్. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోవాలని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గులాబీ నేతలకు సూచించారు. సోమవారం మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రఘనాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల పరుగు మొదలైందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పని ప్రారంభించాలన్నారు. నాలుగేండ్ల మూడు నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రతిఒక్కరూ టీఆర్‌ఎస్‌కే మద్దతు పలికే కార్యాచరణ రూపొందించాలన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట, సుఖాల్లో భాగస్వాములయ్యేందుకు ప్రతీ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని సృష్టించేలా కార్యాచరణ ఉండాలన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...