కన్నుల పండువగా కంటి వెలుగు

Tue,September 18, 2018 01:29 AM

-ఖమ్మం జిల్లాలో 1,10,516 మందికి కంటి పరీక్షలు
-మొత్తం 108 గ్రామాలు, 9 వార్డుల్లో ప్రక్రియ పూర్తి
-28,093 మందికి అత్యాధునిక కళ్లద్దాల పంపిణీ
-ఆపరేషన్లకు 13,072 మంది వివరాలు సేకరణ
ఖమ్మం, నమస్తే తెలంగాణ:సబ్బండ వర్ణాలకు స్పష్టమైన చూపును ప్రసాదించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం చేపట్టిన కంటి వెలుగు పండుగను తలపిస్తున్నది. చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే తేడా లేకుండా ప్రజలంతా మూకుమ్మడిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్దకు వెళుతూ కండ్ల పరీక్షలు చేయించుకుంటున్నరు. సమస్య ఉన్నా లేకపోయినా పరీక్షలు జరిపించుకోవాలన్న సర్కారు సూచనల మేరకు ఇంటిల్లిపాది క్యూ కడుతున్నరు. తద్వారా ఏండ్ల తరబడి వేధిస్తున్న కంటి సమస్యలన్నింటికీ చిటికెలో పరిష్కారం పొందుతున్నరు. జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం చిత్తశుద్దితో కంటి పరీక్షలు నిర్వహిస్తూ సర్కారు ఆశయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నరు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న కమంలోనే జనరల్ వైద్య పరీక్షలు కూడా నిర్వహిన్న సిబ్భంది స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నరు. కాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలోని 32 వైద్య శిబిరాల్లో 4,361 మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నరు. మొత్తం 108 గ్రామాలు, తొమ్మిది మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల ప్రక్రియ పూర్తయింది. మరో 24 గ్రామాలు, ఏడు మున్సిపల్ వార్డులు పూర్తయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి.

1.10 లక్షల మందికి కంటి పరీక్షలు
తెలంగాణ సర్కారు దిశానిర్దేశంలో కొనసాగుతున్న కంటివెలుగు జిల్లాలో ఊపందుకుంది. కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన 32 వైద్య శిబిరాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యాధికారులు, ఇతర సిబ్భంది శరవేగంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నరు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1,10,516 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో పురుషులు 48,348 మంది, మహిళలు 62,161 మంది ఉన్నారు. ఎస్సీలు 24,663, ఎస్టీలు 14,621 మంది, బీసీలు 50,801 మంది, ఓసీలు 18,623 మంది, మైనార్టీలు 1,808 మంది కంటి పరీక్షలు చేయించుకోవటం గమనార్హం. సమస్య ఆధారంగా వారందరికీ ఉచితంగా మందులు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన సింగపూర్ కంపెనీకి చెందిన కళ్లద్దాలను అందిస్తున్నరు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 28,093 మందికి అద్దాలను అందించారు. దూరపు చూపు సమస్య కలిగిన 28,698 మందికి కళ్లద్దాలు కావాలని ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నివేదించారు. శుక్లాలు, ఇతర దీర్ఘకాలిక సమస్య ఉన్న 13,072 మందికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సర్కారుకు వివరించారు. ఖమ్మం దవాఖానాలకు 9,670 మందిని, హైదరాబాద్‌లోని వైద్యశాలలకు 3,498 మందిని సిఫారస్ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ ఏ కొండల్‌రావు పేర్కొన్నారు.

112
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles