నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా


Thu,September 13, 2018 12:53 AM

ఖమ్మం మామిళ్ళగూడెం, సెప్టెంబర్ 12 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -ఈజీఎంఎం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ బి. ఇందుమతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువకులకు భారత్ మోటో కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ - 25, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ -10, సర్వీస్ ఆడ్వజర్స్ - 4, టెక్నిషియన్స్ -10 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. 19నుంచి 30సంవత్సరాలలోపు యువతీ యువకులు జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం ఏరియాలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉండి జాబ్‌మేళాకు రావాలని తెలిపారు. అభ్యర్ధులు ఈ నెల 15వ తేదీన ఉదయం 10.30 గంటల వరకు ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని టీటీడీసీ సమావేశ మందిరానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌ఫోటొస్‌తో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు ఫోన్‌నెంబర్ 8977631851కు సంప్రదించాలని వివరించారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...