త్వరలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభ..


Tue,September 11, 2018 12:44 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ/తల్లాడ: జిల్లాలోనే తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గంలో త్వరలో సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభ నిర్వహించే అవకాశం ఉన్నందన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సోమవారం తల్లాడ, సత్తుపల్లి మండలాల పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తుపల్లి శాసనసభ స్థానాన్ని కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఆన్‌లైన్‌లో ఓటుహక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్తుపల్లి టికెట్ సాధించి తొలిసారిగా వచ్చిన పిడమర్తికి నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. సత్తుపల్లి మండల పరిధిలోని రామానగరంలో పర్యటించారు. కాలనీలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఈ సారి ఎన్నికలలో కారు గుర్తుకు ఓటువేసి మరోమారు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయబాబుల ఆశీస్సులతో అభివృద్ధి పధంలో నడిపిస్తానన్నారు.

సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్‌లో గల గాదె సత్యం నివాసంలో కూడా నిర్వహించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మూకర ప్రసాద్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జక్కంపుడి కృష్ణమూర్తి, మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుండేటి వీరారెడ్డి, అన్నెం వెంకటేశ్వరరెడ్డి, కోడూరి వీరకృష్ణ, గురిజాల రామారావు, కోడూరి రాము, శీలం కృష్ణారెడ్డి, గుంటుపల్లి నరసింహారావు, షేక్ హుస్సేన్, బొగ్గుల కృష్ణారెడ్డి, షేక్ పాషా, ఇనపనూరి విశ్వేశ్వరరావు, సగ్గుర్తి మురళీ, మారయ్య, డీ.నరసింహారావు, పోతురాజు వెంకటయ్య, గాదె సత్యం, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, సొసైటీ చైర్మన్లు చల్లగుళ్ల కృష్ణయ్య, కిలారి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తూరు ఉమ, దొడ్డాకుల గోపాలరావు, మల్లెల్లి శ్రీను, మన్నేని నాగేశ్వరరావు, షేక్ అయూబ్‌బాషా, మల్లూరు అంకమరాజు, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్, కొప్పుల నరేందర్‌రెడ్డి, సాధు శివ, ఖాజా శ్రీను, జ్వేష్ఠ లక్ష్మణరావు, గుడ్లూరు రవి, వసంతరావు, గౌతమ్, హుస్సేన్, శివ, దొడ్డా రాజేంద్రప్రసాద్, యాగంటి శ్రీను, శ్యాంసన్, మట్టా ప్రసాద్, ఖాజా శ్రీను, బుద్దా రవి, శ్రీను, చిన్నా, రాజ్‌కుమార్

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...