మధిర నియోజకవర్గం గెలిపించి చూపించండి...


Tue,September 11, 2018 12:44 AM

మధిర, నమస్తేతెలంగాణ/ఖమ్మం వైరారోడ్ : మధిర నియోజవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. నేటి నుంచి మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు గెలుపుకోసం ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బొమ్మెర రామ్మూర్తి ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బొమ్మెర రామ్మూర్తితో మంత్రి కేటీఆర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచే టీఆర్‌ఎస్ పార్టీలో కీలక భూమిక పోషించిన బొమ్మెరకు భవిష్యత్‌లో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి టీఆర్‌ఎస్ భరోసాను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బొమ్మెర రామ్మూర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతను నిర్వహిస్తూ లింగాల కమలరాజు గెలుపునకు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనే అనేక పోరాటాలు చేసిన బొమ్మెరకు పార్టీ నుంచి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బూత్ లెవల్ నుంచి ఓటర్లను కలసి పనిచేస్తే కమలరాజు గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని, అందుకోసం బొమ్మెర రామ్మూర్తి తోడ్పాటునందించాలని కోరారు.

కమలన్న గెలుపు బాధ్యత నాదే : బొమ్మెర
టీఆర్‌ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమలరాజు గెలుపు బాధ్యత తనదేనని, మంత్రి కేటీఆర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అనంతరం బొమ్మెర రామ్మూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదినుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న తనకు మధిర నియోజకవర్గ సీటు లభించకపోవడం కొంత అసంతృప్తికి లోనయ్యానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తాను అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు. రాబోయే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి లింగాల కమలరాజును ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు బహుమతిగా అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...